25-09-2025 03:15:20 PM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఫుట్ బాల్(football) క్రీడకు పూర్వవైభవం తెస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే(Mahbubnagar MLA) యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ 11వ పురుషుల ఫుట్ బాల్ టౌర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి ఫుట్ బాల్ టౌర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ క్రీడాకారులు అందరూ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలని చెప్పారు. మన జిల్లా క్రీడా మైదానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ 16 కోట్ల మంజూరు చేసిందన్నారు.
క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తామని చెప్పారు. గతంలో ఎంతో మంది ఫుట్ బాల్ క్రీడాకారులు దేశం తరుపున ఆడి రాణించాలని గుర్తు చేశారు. క్రీడలు దైనందిన జీవితంలో మనకు భాగం కావాలని సూచించారు. అనంతరం క్రీడాకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా పాషా, రాషెద్ ఖాన్ రాష్ట్ర ఫుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫల్గున, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, జిల్లా కార్యదర్శి శేఖర్, బాను కిరణ్ , బాలరాజు తదితరులు పాల్గొన్నారు.