25-09-2025 03:11:13 PM
ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాం
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ పట్టణంలోని జామా మస్జీద్ పై అంతస్తు స్లాబ్ నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం అభివృద్ధి కోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, మస్జీద్, దర్గా, ఈద్గా వంటి పవిత్ర స్థలాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. జామా మస్జీద్ నిర్మాణ పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘాల పెద్దలు, మస్జీద్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ముస్లిం సంఘాల పెద్దలు మొహమ్మద్ సాదిక్ పాషా, యాకూబ్ బావజీర్, హబీబ్, నిజాం, హబీబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.