17 April, 2026 | 4:31 PM

పోలీసుల ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంప్ ఏర్పాటు

14-06-2025 12:00 AM

నాగర్ కర్నూల్ జూన్ 13 (విజయక్రాంతి): ప్రజలకు రక్షణగా పనిచేయాల్సిన పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో శుక్రవారం జిల్లా ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్ పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేక మెగా హెల్త్ క్యాంపు ను ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక రోగాలతో పాటు హెల్త్ చెకప్ కోసం ప్రభుత్వ వైద్యులచే ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు.

సుమారు 300 మంది పోలీస్ సిబ్బంది, వారి కుటుం బ సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకోగాప్రభుత్వ ఆసుపత్రి నుండి స్పెషలిస్ట్ డాక్టర్లు పా ల్గొని బీపీ, షుగర్, ఈసీజీ, బ్లడ్ టెస్టులు నిర్వహించారు. ప్రతి మూడు మాసాలకు ఒకసా రి తప్పనిసరి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులుసూచించారు.