15-11-2025 09:37:59 PM
శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల పరిధిలోని ఎల్వెర్తి గ్రామానికి చెందిన కావలి రాఘవేందర్ తెలుగు సాహిత్యంలో చేసిన విస్తృతమైన పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మక డాక్టరేట్ (పీహెచ్ డీ) పట్టాను ప్రకటించింది. శనివారం హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య సూర్యాధనంజయ్ పర్యవేక్షణలో కావలి రాఘవేందర్ "సాహిత్య చరిత్రలు - తెలంగాణ సాహిత్యం" అనే అంశంపై పరిశోధన చేశారు. డాక్టరేట్ పట్టా సాధించిన సందర్భంగా కావలి రాఘవేందర్ కి అధ్యాపకులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, సాహితీవేత్తలు, బంధువులు, గ్రామస్థులు ప్రశంసలు, అభినందనలు తెలిపారు.