01-10-2025 02:47:14 PM
బాన్సువాడ, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ సరస్వతి దేవి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పదొవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మాజీ డిసిసిబి చైర్మన్(Former DCCB Chairman) పోచారం భాస్కర్ రెడ్డి ఆయన సతీమణి సోనీ రెడ్డిలు సతి సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సంతోష్ శర్మ వారిని ఆశీర్వదించారు. దసరా పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ పూజ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి పుష్పమ్మ, ఆలయ ధర్మకర్త పోచారం శంభు రెడ్డి ప్రేమల దంపతులు,బాన్సువాడ పట్టణ నాయకులు, అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.