calender_icon.png 1 October, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారి రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

01-10-2025 01:41:14 PM

చిట్యాల,(విజయక్రాంతి): శ్రీ కనకదుర్గ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమ్మవారి రథోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  ప్రారంభించారు. శ్రీ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చిట్యాల పట్టణంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవి అవతారంలో దర్శనం ఇవ్వగా ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరిపై దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని  కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన అమ్మవారి రథోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, పిసిసి జిల్లా కార్యదర్శి పోకల దేవదాస్, ఆలయ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటన్ వెంకటేశం, మాజీ ఎంపిటిసి ఎద్దులపూరి కృష్ణ, జడల చిన్న మల్లయ్య, వనమా వెంకటేశ్వర్లు, ప్రధాన అర్చకులు వాసుదేవ శర్మ, ఆలయ డైరెక్టర్లు, మహిళా భక్తులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.