01-10-2025 03:05:27 PM
బీఆర్ఎస్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు
మా పోరాటం అంతా.. బీసీ రిజర్వేషన్లపైనే
హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై(BC reservations) కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Telangana Jagruthi President Kavitha) ఆరోపించారు. రెండు నెలలు ఆగి బిల్లు ఆమోదం పొందాక ఎన్నికలు పెడితే నష్టం ఏంటి? అని ప్రశ్నించారు. మా పోరాటం అంతా.. బీసీ రిజర్వేషన్లపైనే అని కవిత స్పష్టం చేశారు. బీసీల అంశంపై బీఆర్ఎస్ సీరియస్ గా కార్యాచరణ చేపట్టాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీతో తనకు ఎలాంటి సబంధం లేదని మరోసారి పునరుద్ఘాటించారు. తెలంగాణలో స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etela Rajender) చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకూడదని ఈటల అంటున్నారని, మహారాష్ట్రలో ఎన్నికలు రద్దు అయినట్లు, తెలంగాణలో కూడా రద్దవుతాయని చెబుతున్నారన్నారు. కోర్టులను తప్పుదోవ పట్టించేలా ఈటల రాజేందర్ మాట్లాడారని ఆరోపించారు. ఈ మాటలు ఈటల సొంతంగా మాట్లాడారా, లేక బీజేపీ పార్టీ చెప్పించిందా? అని ప్రశ్నించారు. దీనిపై ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.