calender_icon.png 1 October, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్ 3 న దేశవ్యాప్త బంద్ జయప్రదం చేయండి

01-10-2025 02:29:05 PM

ముస్లిం పర్సనల్ లా బోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ

సిద్దిపేట (విజయక్రాంతి): రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను వ్యక్తిరేకిస్తూ, ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల జరిగే నష్టలకు నిరసనగ అక్టోబర్ 3 న దేశ వ్యాప్త బంద్ కు పిలుపు నిస్తున్నట్టు అల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సిద్దిపేట జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ(Muslim Personal Law Board Joint Action Committee) అధ్యక్షులు హఫీజ్ అబ్దుల్ సమీ పేర్కొన్నారు.

సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులు, ముస్లిం ల మత,సామాజిక, విద్యా విషయాల్లో రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల విషయం లో ఇతరుల జోక్యం మంచిది కాదన్నారు. ఈ విషయాన్ని సుప్రీం, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తేవాలన్న సంకల్పం తో అక్టోబర్ 3 న దేశ వ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నాం అన్నారు. గతంలో కూడా క్రమ పద్దతిలో నిరసన తెలీలమని అన్నారు. శాంతియుత నీరసనకు కుల మతాలకు అతీతంగా మద్దతు తెలుపలన్నారు. సమావేశం లో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అబ్దుల్ ఖుద్ధుస్, అబ్దుల్ మొయిజ్,కలీం,ఇస్మాయిల్, ఘోసోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.