16 April, 2026 | 11:09 AM

మంథని మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి కన్నుమూత

03-02-2026 10:41 AM

మంథని,విజయక్రాంతి: మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి (75) మంగళవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాదులో మృతి చెందారు. రాంరెడ్డి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందగా ఆరోగ్యం కుదుటపడింది, కానీ మళ్లీ అనారోగ్యం పాలు కావడంతో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రాంరెడ్డికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.