calender_icon.png 3 February, 2026 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 ట్రాక్టర్ల గడ్డివాము దగ్ధం

03-02-2026 10:43:19 AM

పెంట్లవెల్లి: నాగర్‌ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాయ్స్ హైస్కూల్ వెనుక బత్తిని నరసింహకు చెందిన గడ్డివాము ఒక్కసారిగా మంటల్లో చిక్కి సుమారు 10 ట్రాక్టర్ల గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించి జేసీబీ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు రాజేష్, సురేందర్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.