calender_icon.png 3 February, 2026 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలి

03-02-2026 02:38:52 AM

కామారెడ్డిలో గ్రూపు రాజకీయాలకు స్వస్తి,

‘సమన్వయమే’ విజయ మంత్రం

టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

జిల్లా అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేత

కామారెడ్డి, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఏక తాటిపైకి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ లలో క్లీన్  స్విప్ చేయాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలకు కాంగ్రెస్ అభ్యర్థులకు చెందిన బీఫాములను అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవు అన్నారు. అందరం కలిసికట్టుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం‘ అని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా అభ్యర్థులకు బీ-ఫామ్ల పంపిణీ కార్యక్రమం సోమవారం  నిర్వహించారు.

సమన్వయంతోనే గెలుపు సాధ్యం: పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ కేడర్ మధ్య పూర్తి సమన్వయం ఉందని, వర్గ పోరుకు తావులేకుండా అందరూ ఏకతాటిపైకి రావడం శుభపరిణామమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  పేర్కొన్నారు.  ఈ మున్సిపల్ ఎన్నికల్లో ’సమన్వయమే మంత్రం’గా ముందుకు సాగి అన్ని వార్డుల్లో జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్య నేతల సమక్షంలో బీ ఫామ్ల పంపిణీ

మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మహమ్మద్ అజారుద్దీన్, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కి మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల బీ-ఫామ్లు అందజేశారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యం గాపనిచేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా నాయకులకు పిలుపు ఇచ్చారు.కార్యకర్తలు, నాయకులు విభేదాలు పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాలన్నారు. రెబల్ అభ్యర్థులు లేకుండా చూసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు,