08-12-2025 01:09:30 AM
ముకరంపుర, డిసెంబరు 7 (విజయ క్రాంతి): నగరంలోని భగత్ నగర్ హెలిపాడ్ గ్రౌండ్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం వేద పండితులచే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి అష్టోత్తర శత కలశ అభిషేకము, ఆరాధన, అర్చన, మూలమంత్ర శ్రీరామ, హనుమత్ హోమ ము నిర్వహించారు.
మాజీ మేయర్, బిజెపి నాయకుడు వై సునీల్ రావు-అపర్ణ దంపతులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, కమిటీ సభ్యులుపాల్గొన్నారు.