08-12-2025 01:11:00 AM
వేములవాడ, డిసెంబర్ 7 (విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆపై ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ముఖ్యంగా ఇటీవల ఏర్పాటు చేసిన కోడె క్యూలైన్లు, అందులో నిర్మించిన సీసీ రోడ్డు, క్యూలైన్ ఫ్లైఓవర్ పనుల పురోగతిని పరిశీలించారు.
అలాగే ఉచిత దర్శనం క్యూలైన్, రూ.300 ప్రత్యేక దర్శనం క్యూలైన్, వీఐపీ రోడ్డు, పార్వతీపురం ధర్మశాల రోడ్డు, లడ్డు కౌంటర్ నిర్మాణం, కొత్తగా ఏర్పాటు చేస్తున్న షాపుల అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ఆయన పరిశీలించి సూచనలు ఇచ్చారు.అభివృద్ధి పనుల్లో నాణ్యత, వేగం, భక్తులకు మరింత సౌకర్యం లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆది శ్రీనివాస్ సూచించారు.