08-12-2025 01:09:24 AM
-అర్బోరాలోని నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం
-25 మంది సజీవ దహనం.. ఆరుగురికి తీవ్ర గాయాలు
-మృతుల్లో నలుగురు పర్యాటకులు.. 21మంది క్లబ్ సిబ్బంది
-ప్రమాదానికి ఎలక్ట్రిక్ బాణసంచా పేల్చడమే కారణమని ప్రాథమిక నిర్ధారణ
-మృతుల సంఖ్య పెరుగుదలకు మానవతప్పిదమూ కారణమనే ఆరోపణలు
పనాజి, డిసెంబర్ 7: ఉత్తర గోవాలోని బాగా బీచ్ సమీపంలో ఉన్న అర్బోరా ప్రాంతం ‘ బర్చ్ బై రోమియో లేన్’ అనే నైట్ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన అగ్నిప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 25 మంది మరణించారని పోలీసులు పేర్కొన్నారు. మృ తుల్లో 21మంది క్లబ్ సిబ్బంది, నలుగురు పర్యాటకులు ఉన్నారు. కొందరు మంటల్లో చిక్కుకుని మరణించగా, ఎక్కువ మంది దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
నైట్‌క్లబ్‌లో శనివారం రాత్రి ‘బాలీవుడ్ బాంగర్ నైట్’ను ఏర్పాటుచేశారు. ఆదివా రం తెల్లవారుజామున 1గంటకు స్టేజీపై డ్యాన్సర్లు నృత్యం చేస్తున్నారు. ఆ సమయ ంలో డ్యాన్స్ ఫ్లోర్‌పై 100 మందికి పైగా ఉన్నారు. అకస్మాత్తుగా మంటలు రావడం తో గందరగోళం ఏర్పడింది. పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరకొందరు వంట గదిలోకి వెళ్లారు. ఈ క్రమం లో క్లబ్ మొత్తం మంటలు వ్యాపించాయి. పొగ కారణంగా అనేకమంది మరణించారు.
అలంకణలతో ప్రమాద తీవ్రతను
ఈ నైట్ క్లబ్‌ను బ్యాక్ వాటర్ సమీపంలో ఏర్పాటు చేశారు. క్లబ్ అలంకరణకు తాటాకులతో తయారు చేసిన నిర్మాణాలు ఎక్కు వగా ఉన్నాయని, వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని పర్యాటకులు చెబుతున్నారు.
సహాయక చర్యలకు ఆటంకం
క్లబ్‌కు రాకపోకలు సాగించే మార్గాలు చాలా ఇరుకుగా ఉండడంతో అగ్నిమాపక యంత్రాలు లోపలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బ ందులు ఎదుర్కొన్నాయని తెలుస్తోంది. క్లబ్ కు సుమారు 400 మీటర్ల దూరంలోనే ఆ వాహనాలను ఉంచాల్సి రావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగిందని అగ్ని మాపక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అయినా, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. తెల్లవారుజాము వరకూ సహాయక చర్యలు కొనసాగాయి. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. భవనం నుంచి భారీ మంటలు, పొగలు వెలువడడం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచారం
ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం తనను కలచివేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. గాయపడిన వారు కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రమాదం బాధాకరం: ప్రధాని
ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ స్పం దిస్తూ, ఇది చాలా బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. ప్రభుత్వం బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ప్రమాదంపై భిన్నవాదనలు
నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. క్లబ్‌లో డ్యాన్సర్ల ప్రదర్శన సమయం లో ఎలక్ట్రిక్ బాణసంచా పేల్చారని, దా ని వల్లే మంటలు అంటుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమం లోనే తొక్కిసలాట జరిగిందని, దట్టమై న పొగ కమ్ముకుందని, ఇరుకు దారుల గుండా బయటికి పరుగులు తీసినట్టు చెబుతున్నారు. దీనిపై సీఎం స్పంది ంచారు.
ఎలక్ట్రిక్ బాణసంచా పేల్చడం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు చెబుతున్నారు. ఈ కేసులో క్లబ్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మోదక్, జనరల్ మేనేజర్ వివేక్ సింగ్, బార్ మేనేజర్ రాజీవ్ సంఘానియా, గేట్ మేనేజర్ రియా న్షు ఠాకుర్‌ను అరె స్ట్ చేసినట్లు తెలిపా రు. క్లబ్ యజమానులు సౌరభ్ , గౌరవ్ లూథ్రాలపై వారెంట్ జారీ చేశామని, అరెస్ట్ చేస్తామని తెలిపారు. విషాదానికి క్లబ్ యాజమాన్యం నిర్లక్ష్యం, అక్రమ నిర్మాణం, ఇరుకైన దారులే కారణాలనే వాదన లూ వినపిస్తున్నాయి.
ప్రమాదంలో మరణించిన ఎక్కువ మంది మృతదేహాలను గ్రౌండ్ ఫ్లోర్ లోని వంటగది ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నందున సిలిండర్ పేలుడు కారణంగా కూడా జరిగిండొచ్చని అనుమానిస్తున్నారు. గోవా డీజీపీ అలోక్ కుమార్ సైతం ప్రాథమికంగా పరిశీలిస్తే ఇదే అనుమానం కలుగుతోందని చెప్పారు.
మృతుల కుటుంబాలకు 5లక్షలు..క్షతగాత్రులకు 50 వేలు
- పరిహారం ప్రకటించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్
అగ్నిప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని గోవా సీఎం సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తున్నకు కమిటీ వేశామని తెలిపారు. ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాను. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలకు దిగుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే క్లబ్ నిర్వాహకుల మధ్య వివాదాలు ఉన్నాయని స్థానిక ప్రజా ప్రతినిధులు మీడియాకు తెలిపారు. పరస్పరం పంచాయతీలో ఫిర్యాదు చేయడంతో క్లబ్ కూల్చివేతకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.