05-10-2025 01:23:32 PM
పంట నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నెలరోజులైనా, ఇప్పటికీ రూపాయ చెల్లించకాపాయే
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల ఆర్థిక సహాయం అందించాలి
నాగిరెడ్డిపేట మండలంలో నీట మునిగిన పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలో రహదారులు ఎక్కడికక్కడ తెగిపోవడంతో ప్రజలకు తీవ్ర అవస్థలు ఎదురైనాయి. కాలువలకు గండ్లు పడ్డాయి, చెరువులు ఎక్కడికక్కడే పోయాయి. భారీగా కురిసిన వర్షానికి మంజరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం ఉన్న మాల్ తుమ్మెద నాగిరెడ్డిపేట ఛీనూర్, వాడి గొలి,లింగాల, బంజారా లింగంపల్లి వెంకంపల్లి తాండూర్ మాటూర్ ఆత్మకూర్రం ఎర్రరం, ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం అత్తమాల మల్కాపూర్ గ్రామాల రైతుల పంట పొలాల్లోకి ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్టు నుండి పసుపేరు నుండి ఉదృతంగా భారీ వరద చేరి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
ప్రభుత్వం వెంటనే అధికారుల నుంచి నివేదికను అందుకొని నష్టపోయిన రైతులకు ఎకరనికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందజేయాలని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలోని బంజర గ్రామంలో ఒప్పొంగి ఎల్లారెడ్డి మెదక్ ప్రధాన రహదారి రెండు వైపులా పొలాలు నీట మునిగి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలన్నారు. పోచారం ప్రధాన కాలువ నాగిరెడ్డిపేట ఎల్లారెడ్డి మండలాలకు జీవనాధారం అని ప్రధాన కాలువకు అయిదు చోట్ల గండి పడ్డదని కనీస అధికారులు ఆ గండ్లను కూడా పూడ్చడం లేదని మండిపడ్డారు.
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలంకు విచ్చేసారని కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి మార్గమధ్యలో లింగంపల్లి గుర్తు వద్ద బ్రిడ్జ్ తెగిపోయిందని రాకపోకలు నెల రోజులుగా ప్రజలకు ఇబ్బందులు అయినప్పటికీ తక్షణమే పనులు చేపట్టాల్సిన నేపథ్యంలో నిర్లక్ష్యం ఎందుకు అని మండిపడ్డారు. ప్రజలకు రాకపోకల సౌకర్యాన్ని ప్రభుత్వం వెంటనే సమకూర్చాలని పనులు వేగవంతం చేసి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. కామారెడ్డి జిల్లాలో 344 కోట్ల రూపాయల పంట నష్టం ఆస్తినిష్టం జరిగిందని జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తక్షణమే ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం ఎగర 25 వేల రూపాయల చొప్పున అందించాలని కోరారు.
జిల్లాలో చాలా చట్ల నివాసకు ఇల్లు కూడా వర్షానికి కూలిపోయాయని కూలిపోయిన నివాసకు ఇండ్ల యజమానులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు మంజూరు చేసి వారి ఆదుకోవాలని తెలిపారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందజేయాలి సన్న వడ్లకు బోనస్ అందించాలి వరద బాధితులను నివాస బిల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం వెంటనే ఇండ్లు అందే విధంగా చర్యలు చేపట్టాలి అని సూచించారు. జిల్లాకు మంత్రి లేరు అని ఇంచార్జ్ మంత్రి అసలే రారు అని మండిపడ్డారు. రోడ్ల భవనాల శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ వరదలకు రహదారులు వంశమయ్యి పలుచోట్ల రాకపోకలు నిలిచినప్పటికి,మంత్రి రాకపోవడం ఎంతో బాధాకరం అని అన్నారు. మంత్రులు ఒక్క వైపు ముఖ్యమంత్రి ఒకవైపు ప్రయత్నిస్తున్నారని,మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముజీబుద్దిన్, ఎల్లారెడ్డి మాజీ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, నాగిరెడ్డిపేట మండలం మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, నాగిరెడ్డిపేట మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, గుర్రాల సిద్దయ్య, మాల్ తుమ్మెద ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు, నర్సింలు, నాయకులు వంశీధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పరిశోధన్ రెడ్డి, ఎల్లారెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జలంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్, ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు ఏగుల నర్సింలు, అరవింద్ గౌడ్, రాజు, ఎరుకల సాయిలు, బబ్లు తదితరులు పాల్గొన్నారు.