05-10-2025 01:31:18 PM
నిండుకుండలా నిజాంసాగర్
ఎస్సారెస్పీలోకి వరద ప్రవాహం
పొంగి పొర్లుతున్న వాగులు
బాన్సువాడ,(విజయక్రాంతి): సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలతో జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టులన్ని జలసిరులతో సందడి చేస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుండి వస్తున్న వరద నీరు దిగువన ఉన్న ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో రోజురోజుకు ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పెరుగుతూనే వస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. అలాగే సింగీతం, కళ్యాణి, పోచారం, పసుపు వాగు ప్రాజెక్టులు కూడా వరద నీటితో నిండిపోయాయి.
కామారెడ్డి గాంధారి, బిక్నూర్ ప్రాంతాల్లో ఉన్న డ్యాములు సైతం వరద నీటితో నిండుగా కనిపిస్తున్నాయి. ఇటు కళ్యాణి, సంగీతం, పోచారం ప్రాజెక్టులు వరద నీటితో నిండిపోవడంతో ఇరిగేషన్ అధికారులు గేట్లెత్తి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీటిని పంపిస్తున్నారు. నిజాంసాగర్ జలాశయం, గోదావరి, మంజీరా జలాశయాల నుండి కూడా వరద నీరు ప్రాజెక్టుల నీటి సామర్థ్యాన్ని సరిపోడంతో ఇరిగేషన్ అధికారులు గేట్లెత్తి ఎస్సారెస్పీకి ఎస్సారెస్పీకి విడుదల చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు, జలాశయాలు నిండుకుండల మారడంతో ఎస్సారెస్పీ జలాశయంలోకి ఎన్నడు లేనట్లుగా వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది.
ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి రెండు లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుండి ఇన్ఫ్లో అవుతుండగా 22 గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. నేను టీఎంసీలు ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు 14 టీఎంసీల సామర్ధ్యం వరకు నీరు నిలువ చేరుకుంది. పోచారం ప్రాజెక్టు నుండి 30 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. అలాగే కళ్యాణి సంగీతం ప్రాజెక్టుల నుండి రెండు గేట్లు తెరిచి 5000 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్లోకి మళ్లిస్తున్నారు. కామారెడ్డి లో ఉన్న అతిపెద్ద నిజాంసాగర్ ప్రాజెక్టులలో నిలువ ఉన్న నీరు గోదావరిలోకి చేరడంతో వరద నీరు ఎస్సార్ ఎస్పీలోకి చేరుతుంది. ఇరువైపుల నుండి వస్తున్న వరద నీటితో ఎస్ఆర్ఎస్పీ నీటి సామర్థ్యం నిండిపోవడంతో భారీ నీటిపారుదల శాఖ అధికారులు 48 గేట్లు ఎత్తేసి పంపిస్తున్నామని అధికారి చక్రపాణి తెలిపారు.
ఇదిలా ఉండగా మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. ఇప్పటికే జలాశయాల పరిస్థితి ప్రాజెక్టు నీటి సామర్థ్యానికి చేరుకోవడంతో వచ్చే వరద నీరు ఏ మేరకు చేరుతుందని అధికారులు అంచనాల్లో తల మునకలవుతున్నారు. మరోవైపు గ్రామాల్లోని చెరువులు కూడా వర్షపు నీటితో నిండిపోవడంతో కట్టల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలంలో ఈసారి ఆశించిన స్థాయి కంటే అధికంగా భారీ అతి భారీ వర్షాలు కురియడంతో ప్రాజెక్టుల్లో వరద నీరు వచ్చి చేరుతుండడం, అట్టి నీటిని అధికారులు గేట్లు తెరిచి దిగువకు పంపిస్తుండడం సందర్శకులను సంబుర పెడుతోంది.
ప్రాజెక్టులు సరే.. పంటల పరిస్థితి ఏంటి...
పక్షం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర ప్రధాయినులుగా ఉన్న నిజాంసాగర్ ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిండుకుండల మారడంతో రైతుల హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ, ప్రస్తుత పంటల సాగు పరిస్థితి ఏమిటా అన్న ఆందోళన పట్టుకుంది. ఉమ్మడి జిల్లాల్లో అధికంగా వరి పంటను రైతులు సాగు చేస్తుంటారు. అలాగే మొక్కజొన్న సోయా పంటలకు కూడా ప్రాధాన్యత నిస్తుంటారు.
ఇప్పటికే చేతికి వచ్చిన మొక్కజొన్న పంట అమ్ముకునే దశలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మొక్కజొన్న పంట పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఎదుగుతున్న సోయా పంటపై వర్షాల దెబ్బ పడటంతో పంటలు పూర్తిగా నేలకొరిగాయి. మొక్కజొన్న సోయా పంటలు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా లాభాన్ని చేకూరుస్థాయి అనుకున్న రైతాంగానికి అడియాసే ఎదురయింది. మార్కెట్కు తరలించుకునేందుకు ముందుగా రైతులు ఆరబెట్టుకున్న పంటను వర్షం తడిసి ముద్ద చేసింది.
కుప్పచేసి పెట్టుకున్న మొక్కజొన్న రంగు మారుతుందని రైతులు దిగాలి చెందుతున్నారు. ఇప్పటికే పంటలు దెబ్బతిని స్థితికి చేరుకోవడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి కాస్త చేజారి పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఇటు ప్రాజెక్టులు నిండుకున్నాయని సంబురపడాలో... సాగు చేసిన పంటలు చేజారిపోయాయని బాధపడాలో ఎటు తోచని పరిస్థితిలో రైతులు ఆందోళనలో పడ్డారు.