05-10-2025 01:10:17 PM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్‌తో పాటు సమీపంలోని తిమ్మాపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమైనయి. కలెక్టరేట్ రోడ్డుపై కొద్దిసేపు రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాలతో మరోసారి ఎల్ఎండీకి వరద ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయి.