05-10-2025 01:41:54 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ ను హైదరాబాదులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డిజిపి, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ లకు రాజేందర్ రావు పూలబోకెలు అందించి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వారికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిజిపితో పలు అంశాలపై వెలిచాల రాజేందర్ రావు చర్చించారు.
తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని రాజేందర్ రావు పేర్కొన్నారు. పోలీస్ శాఖలో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నా యని తెలిపారు. పోలీస్ శాఖ బాధితులకు అండగా నిలుస్తూ నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవడంలో దేశంలోనే ముందంజలో ఉందని అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ కొత్త డీజీపీ సారధ్యంలో పోలీస్ శాఖ అత్యుత్తమైన సేవలందిస్తూ మరింతగా ప్రజల అభిమానాన్ని చురగొనాలని రాజేంద్ర రావు ఆకాంక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.