calender_icon.png 5 October, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కారణంగా ప్రజావాణి రద్దు.!

05-10-2025 01:01:44 PM

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం  జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజావాణి కార్యక్రమం నిలిపివేసినట్లు  తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం మళ్లీ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఎన్నికల నియమావళి అమలు విషయంలో జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.