05-10-2025 01:38:36 PM
చిట్యాల,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు. ఆదివారం తెల్లవారు జామున సుమారు 05.30 గంటల సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆరంజ్ ట్రావెల్స్ బస్ ఎన్ఎల్ 01బి 3210 ట్రాఫిక్ వలన చిట్యాలలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ సమీపంలో ఆగి ఉండగా బస్ వెనకాల వెళ్తున్న కారు ఏపీ 39 ఎంఎచ్ 5699 డ్రైవర్ కూడా తన కారును ఆరంజ్ ట్రావెల్స్ బస్ వెనకాల ఆపగా అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ బస్ ఎన్ఎల్ 01బీ 2457 డ్రైవర్ జోవన్నపూడి విజయ్ కుమార్ తన బస్ ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి కారును వెనకాల నుండి బలంగా డీకోట్టగా, కారులో ప్రయాణిస్తున్న గొర్రె జోష్ కుమార్ తండ్రి జోజయ్య, చల్ల శ్రీహర్ష, మచిలీపట్టణం వాస్తవ్యులు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. ఇట్టి విషయంలో పైలా మురళి తండ్రి పాండు రంగారావు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించనైనది అని చిట్యాల ఎస్సై మామిడిరవికుమార్ తెలిపారు.