calender_icon.png 5 October, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకా జయంతి వేడుకలకు తరలిన మండల కాంగ్రెస్ నాయకులు

05-10-2025 03:01:29 PM

మందమర్రి,(విజయక్రాంతి): దివంగత మాజీ కేంద్రమంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ కాక వెంకటస్వామి 96వ జయంతి వేడుకలకు మండల కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. హైదరాబాదు లోని ట్యాంక్ బండ్ పై ఆదివారం నిర్వహించిన జయంతి వేడుకలకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందే రామ్ చందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాక విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామ్ చందర్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో నిరుపేదలకు ఉచితంగా గుడిసెలు నిర్మించి గుడిసెల వెంకటస్వామిగా పేరు తెచ్చుకున్నారన్నారు.

సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం సంక్షేమానికి నిర్విరామంగా కృషి చేశారని, ముఖ్యంగా బొగ్గు గని కార్మికులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయడంతో పాటు, కార్మిక వర్గానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి కార్మిక పక్షపాతిగా పేరు సంపాదించుకున్నారని ఆయన సేవలను కొనియాడారు. కాగా హైదరాబాద్ తరలి వెళ్ళిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బానోత్ నీలయ్య, మాజీ మండల కాంగ్రెస్ అధ్య క్షులు కడారి జీవన్ కుమార్, మాజీ సర్పంచ్ గోదారి రాజేష్, మాజీ ఎంపిటిసి సభ్యులు దుర్గం కుమారస్వామి, సీనియర్ నాయకులు కొట్టే సంపత్, పెంచాల రాజలింగు, మాసు సంతోష్ కుమార్, ఆకుల అంజి, దుర్గం కుమార్, సుధాకర్, నిండుగురి పున్నం లు పాల్గొన్నారు