05-10-2025 01:13:43 PM
పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికలు మాడల్ కోడ్ అమలులో ఉన్నందున అధికారులంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులలో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.