15 April, 2026 | 3:16 AM

జాగృతి విద్యార్థులకు మాజీ మంత్రి సన్మానం

15-04-2026 12:00 AM

వనపర్తి, ఏప్రిల్ 14 ( విజయక్రాంతి ) : ఇటీవల వెలువడిన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలలో పట్టణంలోని జాగృతి కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మొదటి సంవత్సరం బైపీసీ లో ఉజ్మా హజారా 438 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును, అదే విధంగా ద్వితీయ సంవత్సరం బైపీసీ లో హెచ్ .అనుష్ణ 994 మార్కులతో ఉమ్మడిజిల్లా మొదటి ర్యాంకును సాధించి మరొకసారి వనపర్తిలో ప్రతిభ చాటారు, ఈ విషయాన్ని తెలుసుకున్న మాజి మంత్రి నిరంజన్ రెడ్డి జాగృతి కళాశాలకు వచ్చి స్టేట్ ర్యాంకర్లను ఘనంగా సన్మానించారు.

ఈ సంధర్భంగా మాజి మంత్రి మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో కార్పొరేట్ స్థాయి మార్కులతో , రాష్ట్ర ర్యాంకులను మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఫస్ట్ ర్యాంకులను సాధిస్తూ ఉమ్మడి జిల్లాలో అద్బుతమైన ఫలితాలు సాధిస్తున్నందుకు జాగృతి కళాశాల విద్యార్థులను అభినందించారన్నారు .అదే విధంగా జె ఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1 ఫలితాలలో సి హెచ్ అర్జున్ 91.69 శాతం తో జిల్లాలో అగ్రగామిగా నిలవడం జరిగింది అని ఆయన కొనియాడారు.

జిల్లాలో ఇంటర్ విద్యలో ఇంటర్ మార్కులతో పాటు జె ఈఈ, నీట్ , ఈ ఏ పి సి ఈ టి లలో కూడా కార్పొరేట్ కళాశాలలకు దీటుగా జాగృతి కళాశాల నిలవడం ఎంతో సంతోషంగా ఉందని జాగృతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంబటి వినోద్ కుమార్ యజమాన్య సభ్యులు భాస్కర్, శ్యామ్ కుమార్, సత్యనారాయణ లను ఆయన ప్రత్యేకంగా అభి నందించారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, ప్రేమ్ నాథ్ రెడ్డి , భాగ్యరాజు, హేమంత్ తదితర నాయకులు, యజమాన్య సభ్యులు, అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.