సమన్వయం పాటించండి.. పరిష్కరించుకుందాం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్, ఏఫ్రిల్ 14 : కాంట్రాక్టు విద్యుత్తు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా నని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం కాంట్రాక్టు టెక్నికల్ ఫీల్ ఉద్యోగులు విద్యార్హతలు లను బట్టి ఎపిఎస్‌ఇబి రూల్స్ అమలు చేయాలని ఉమ్మడి జిల్లా కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వ విప్ ని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కాంట్రాక్టు విద్యుత్తు ఉద్యోగుల సంఘం చైర్మన్ జఖి, డివిజన్ చైర్మన్ పెంటయ్య, నాయకులు తిరుమలేష్, గౌరయ్య, శ్రీను, హన్మంతు రెడ్డి, నజీర్ తదితరులు పాల్గొన్నారు.






