15 April, 2026 | 3:16 AM

అందరివాడు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్

15-04-2026 12:00 AM

వరంగల్/హనుమకొండ/ములుగు/జనగామ/జయశంకర్ భూపాలపల్లి/ మహబూబాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): ముందు చూపుతో రచించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, ఆ మహనీయుని స్ఫూర్తితో ముందుకు సాగాలని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.

హనుమకొండ లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి.రియాజ్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో సిరిసిల్ల రాజయ్య, ఎంపీ కావ్య మాట్లాడుతూ అంబేద్కర్  రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించారన్నారు. 

కార్యక్రమంలో ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, డీఆర్డీవో మేన శ్రీను, మెప్మా పీడీ జోనా, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, డీడబ్ల్యూవో విశ్వజ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, మహనీయుల ఉత్సవ కమిటీ ఛైర్మన్ బండారి సురేందర్, నాయకులు మంద కుమార్, పుట్ట రవి, అంకెశ్వరపు రామచంద్రరావు, చుంచు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ లో..

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని కాశీబుగ్గ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య , జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారధ, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్లు గుండేటి నరేంద్ర కుమార్, బస్వరాజు శిరీష శ్రీమాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్, పీసీసీ సభ్యులు నల్లగొండ రమేష్, నగర మహిళా అధ్యక్షురాలు నారగోని స్వప్న మురళి గౌడ్,

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజనాల శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు తత్తరి లక్ష్మణ్, జన్ను రవి, దామెర సర్వేశం, ధూపం సంపత్, జన్ను ఆరుణ్, బిల్లా శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోరంట్ల రాజు, యూత్ కాంగ్రెస్ తూర్పు అధ్యక్షులు ఎండి సలీం, వరుణ్, ఎన్ ఎస్ యు ఐ నగర మాజీ అధ్యక్షుడు చాగంటి శ్రీనివాస్,

సోషల్ మీడియా కన్వీనర్ సోమలక్ష్మి, ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కోదాటి అనిల్, రాముల, బాబు, బొలుగోడ్డు శ్రీనివాస్, భైరబోయిన చంద్రమౌళి, జంజీరాల వేణు, వెల్దండి లక్ష్మణ్, కేశెట్టి వేణు, తోట బాలరాజు, ఈటల ఉమేందర్, ఈసంపల్లి ప్రభాకర్, గుండేటి సతీష్, గజ్జల లింగమూర్తి, కొత్తపల్లి రాజ్ కుమార్ చిరంజీవి, ఎండి మస్తాన్ డివిజన్ అధ్యక్షుడు కొమ్ముల సందీప్ కుమార్ మంద సన్నీ ఇనుగాల బాబు, బత్తుల వినోద్ కుమార్, ఐలోని వెంకన్న కుసుమ మురళి బండ్ల సురేందర్ ఎండి పాషా, ప్రదీప్, మార్త ఆంజనేయులు నరిగే శ్రీనివాస్, నెల్లుట్ల ఎల్లయ్య, పెండ్యాల కొమురయ్య  తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ కమిషనరేట్ ..

వరంగల్ నగర  పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పరిపాలన విభాగం కార్యాలయ భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, పరిపాలన విభాగం అదనపు డీసీపీ రవి ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కు నివాళులు అర్పించిన వారిలో అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్ ఎసిపిలు డేవిడ్ రాజు, జాన్ నరసింహులు, అంతయ్య, సురేంద్ర తో పాటు ఆర్. ఐలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్. ఎస్. ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ లో..

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 135 వ జన్మదిన వేడుకలు అధ్యక్షులు వేముల నాగరాజు అధ్యక్షతన ఘనంగా జరిగాయి.  క్లబ్ ఆవరణలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యాం, బొడిగె శ్రీను, కొడిపెల్లి దుర్గాప్రసాద్ రావు, సహాయ కార్యదర్శులు పొడిచెట్టి విష్ణువర్ధన్, ఈసీ మెంబర్లు వీరగోని హరీష్, ఎండీ నయీంపాషా, జర్నలిస్టులు గునిశెట్టి విజయభాస్కర్, దాసరి శ్రీనివాస్, శ్రీహరిరాజు, తోట  తిరుమల్, చేతి శ్రీనివాస్, సంపెట వెంకటేశ్వర్లు, ప్రదీప్ రాజ్, సెంసాని మోహన్, కిషోర్, మాడ నర్సయ్య, గజ్జి సురేష్, దేవేందర్, సునీల్, అనిల్,రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

హనుమకొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో..

భారత రాజ్యాంగ నిర్మాత, నవభారత భాగ్యవిధాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను హనుమకొండ హంటర్ రోడ్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దొంతి దేవేందర్ రెడ్డి, జిల్లా పదాధికారులు సండ్ర మధు, ఆకుల శ్రీకాంత్ పటేల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు గౌడ్, రాధారపు శివ కుమార్, బొమ్మసాని అనిల్ యాదవ్, పిట్టల ధనలక్ష్మి , జరీన, సంపత్ రెడ్డీ, రవీందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, కల్యాణ్, శ్రీకాంత్, మురళీ, జితేందర్, రఘుపతి, జిల్లా నాయకులు కురిమిండ్ల సదానందం, రాజ్ కుమార్, అంజీవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బచ్చన్నపేటలో..

మండల కేంద్రంలో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు కంత్రి  సత్తయ్య ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో  ముఖ్య అతిథిలుగా నర్మెట్ట సీఐ అబ్బయ్య, బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు, పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు మల్యాల బాల నరసయ్య, పైసా రాజశేఖర్, అల్వాల రాజు, అల్వాల రమేష్,  ఉప సర్పంచ్ బైరి రజిత వెంకటయ్య, పాలకవర్గ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, మాల మహానాడు నాయకులు  కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఆర్‌ఎస్ నాయకులు బిజెపి నాయకులు, వివిధ బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మంగపేటలో...

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను మంగళవారం మంగపేట మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండలంలోని కమలాపురం, మంగపేట, తిమ్మంపేట, రాజపేట, అకినేపల్లి మల్లారం గ్రామాలలోని అంబేద్కర్ విగ్రహాలకు వివిధ దళిత సంఘాల, యువజన సంఘాల, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

మండల కేంద్రమైన మంగపేటలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన మంగపేట ఎస్త్స్ర టి.వి.ఆర్.సూరి, రెండవ ఎస్త్స్ర శ్రీకాంత్ పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా జరిగిన  వేడుకలలో వివిధ దళిత సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.