7 April, 2026 | 11:56 AM

Breaking News

తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •  

పాలమూరు పచ్చగానే ఉంది.. ఇప్పుడు వలసలు లేవు

01-12-2024 03:19 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): పరిశ్రమల కోసం లగచర్లలో ఎప్పుడో భూములు గుర్తించామని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. లగచర్లలో కొత్తగా భూములు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం పాలమూరు పచ్చగానే ఉందని.. ఇప్పుడు వలసలు లేవని వెల్లడించారు. పాలమూరు ప్రజలు మళ్లీ వలసపోయే పరిస్థతి తేవొద్దని ఆయన కోరారు. కేసీఆర్ ఇచ్చినట్లు ఎకరాకు రూ.10 వేల రైతుబంధు ఇవ్వడం చేతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రూ.35 వేల కోట్ల బోనస్ రైతులకు ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో ఎన్ కౌంటర్లు అనేవే లేవు, మళ్లీ ఎందుకు పునరుద్ధరించారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుతున్న సీఎం రేవంత్.. మీ కుటుంబ సభ్యుల ఆగడాలకు సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో కొద్ది రోజుల క్రితం మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుని మరణించిన సందర్భంలో విధించిన ఆంక్షలు ప్రజలు మరిచిపోలేదు... కనీసం పరామర్శకు కూడా వెళ్లనివ్వలేదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు.