05-08-2025 01:51:21 AM
సనత్‌నగర్, ఆగస్టు 4 (విజయక్రాంతి): మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మృతుల కుటుం బాలను పరామర్శించి సంతాపం, సానుభూతి తెలిపారు. సనత్‌నగర్‌లోని దాసారం బస్తీ మాజీ అధ్యక్షుడు యాదగిరి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు కుమార్ సోదరుడు సతీష్ లు ఆదివారం రాత్రి మరణించారు.
విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం వారి నివాసా లకు వెళ్ళి పార్ధీవ దేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుం బ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే వెంట అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, కూతురు నర్సింహ, కట్ట బలరాం, వనం శ్రీనివాస్, భూపాల్‌రెడ్డి, రాజు తదితరులు ఉన్నారు.