calender_icon.png 5 August, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు

05-08-2025 01:50:01 AM

  1. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పీసీసీ చీఫ్ 
  2. మాజీ ఎమ్మెల్యే చేరికతో పార్టీకి మరింత బలం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకులు కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా పని చేసిన కోటేశ్వరరావుకు క్షేత్ర స్థాయిలో ప్రజలు సమస్యలు తెలిసిన నాయకుడని తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి మహేష్‌కుమార్‌గౌడ్ ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కొండబాల కోటేశ్వరరావు సొంత గూటికి రావడం అభినందనీయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆయన చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం పెరిగిందని తెలిపారు.