calender_icon.png 5 August, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌పై నెపం నెట్టడమే ప్రభుత్వ లక్ష్యం

05-08-2025 01:51:44 AM

  1. కాళేశ్వరం పిల్లర్లు రిపేర్ చేయొచ్చుగా.. 
  2. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాం తి): కాళేశ్వరం పిల్లర్లు రిపేర్ చేయకుండా కేసీఆర్‌పై నెపం వేయాలని ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ కేసీఆర్‌ని టార్గెట్ చేసిందని, లక్ష కోట్లు తింటే మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.

మేము ఏమి చేయకపోతే ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పాలమూరు జిల్లాకు ఏమి చేసిందో చెప్పాలని, 90 శాతం పూర్తయిన పాలమూరు ప్రాజెక్టుని మిగతా 10 శాతం ఎందుకు పూర్తి చేయలేదన్నారు. తాము చేసిన అభివృద్ధి ప్రతి రూపాయికి లెక్కుందని, 188 చెక్‌డ్యామ్‌లు కట్టగా.. వాటి వల్ల వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయన్నారు. కొడంగల్ లిఫ్ట్‌కు అనుమతులు లేవని, భూసేకరణ అడ్డగోలుగా చేస్తున్నారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. మా నియోజకవర్గంలో భూములకు ఓ రేటు, కొడంగల్‌లో ఓ రేటు ఇచ్చి వివక్షత చూపిస్తున్నారని మండిపడ్డారు.