రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
28న కరీంనగర్‌లో 2 లక్షల మందితో సమరభేరి
రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
వాల్ పోస్టర్ ను విడుదల చేసిన మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్,ఏప్రిల్ 3(విజయక్రాంతి): అన్న దాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతుల డిమాండ్ల సాధనకు ఈనెల 28న కరీంనగర్‌లో 2 లక్షల మందితో ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభను నిర్వహిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రా మారావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మ డి మెదక్, రంగారెడ్డి జిల్లాల రైతు ప్రజా సంఘాల నాయకులతో కలిసి మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్‌ల చేతుల మీదుగా కార్యక్రమ వాల్ పోస్టర్ ఆవిష్కరించినట్లు రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలా డి రామారావు శుక్రవారం హిమాయత్నగర్ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాకు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్ప వారిని ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతుందని అన్నారు. మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ లను కలిసి సభకు ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ప్రజా సంఘాల అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి, నాయకులు నదిపెల్లి వెంకటేశ్వర్ రావు, హంస కేతన్ రెడ్డి, చకిలం రమణయ్య, వన్నాల విష్ణు వర్ధన్ రెడ్డి, నరేష్ యాదవ్, మంద గల్ల నగేష్, కవ్వంపల్లి అనిల్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.




