4 April, 2026 | 4:13 AM

ఓపెన్ జిమ్‌లు ఆరోగ్యానికి ఉపయోగం

04-04-2026 02:28 AM

ఓపెన్ జిమ్‌లను ప్రారంభించిన కేంద్ర మంత్రి జీ. కిషన్‌రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్

ముషీరాబాద్, ఏప్రిల్ 3(విజయక్రాంతి): ఓపెన్ జిమ్ లు పిల్లలకు ఎంతో ఉపయోగమని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం గాంధీనగర్ డివిజన్ లోని సిద్ధం శెట్టి అపార్ట్మెంట్స్,  జనప్రియా అబడ్స్ అపార్ట్మెంట్ లలో సి ఏస్‌ఆర్ ఫండ్స్ రూ. 20 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను కేంద్ర మంత్రి జి.  కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ డా‘ కె.లక్ష్మణ్, గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని విన య్ కుమార్‌లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  మాట్లాడుతూ ఓపెన్ జిమ్ ల ఏర్పాటు ద్వారా పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు మంచి ఉపయోగకరమని, ప్రతి రోజూ వ్యాయా మం చేయడం వల్ల ఆరోగ్యం, శరీర ధారు డ్యం, పెరగడం ద్వారా మానసిక ఆహ్లాదం చేకూరుతుందన్నారు.  ప్రతి ఒక్కరూ రోజు వ్యయాయం దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి. భరత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యద ర్శి రమేష్ రామ్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ. వినయ్ కుమార్,  డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్ సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, వైద్యనాథ్, శ్రీకాంత్, బాల కృష్ణ, సత్తి రెడ్డి, మహమూద్, వంజారి నవీన్, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, సిద్ధం శెట్టి అపార్ట్మెంట్స్ వాసులు జితేందర్ రెడ్డి, జయ్ కృష్ణ, ప్రసన్న, లక్ష్మీ, జనప్రియ అపార్ట్మెంట్స్ వాసులు స్వామి దాస్, మల్లేష్, సుధ, మితేష్ తదితరులు పాల్గొన్నారు.