వృద్ధులకు చేరువగా ఆరోగ్య సేవలు
‘ప్రణామ్’ ప్రారంభించిన అస్టర్, కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్, జూలై 30(విజయక్రాంతి): దేశంలో వృద్ధుల జనాభా ప్రస్తుతం 15 కో ట్లను దాటగా, రానున్న దశాబ్దంలో ఈ సం ఖ్య మరింత వేగంగా పెరగనున్న నేపథ్యం లో, వృద్ధులకు మరింత సులభమైన, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన, ఆత్మీయ ఆరోగ్య సేవలను అందించేందుకు అస్టర్ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్ సంయుక్తంగా ‘ప్రణామ్’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఆసుపత్రిలో చికిత్సతోనే పరిమితం కాకుండా, వృద్ధులకు నిరంతర ఆరోగ్య సంరక్షణ, మానసిక భరోసా, సంరక్షకులకు సహకారం, ఆరోగ్యకరమైన వృద్ధా ప్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైద రాబాద్ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ డాక్టర్ ప్రి యాంక అల, గౌరవ అతిథిగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నరసింహరాజు దిచ్‌పల్లి పాల్గొని ‘ప్రణామ్’ను ప్రా రంభించారు. ఈ కార్యక్రమంలో అస్టర్ డీ ఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ సీఈఓ (ఇండియా-II) డాక్టర్ పవన్ కుమార్, ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ శలభ్ డాంగ్ , చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ జోషి, చీఫ్ హ్యూమ న్ రిసోర్సెస్ ఆఫీసర్ డాక్టర్ అమిత్ సింగ్, రీజినల్ సీఈఓ నీలేశ్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ విన్సీ అశోక్ త్రిభువన్, సీనియర్ వైద్యులు, ఆరోగ్య నిపుణులు, పెద్ద సంఖ్యలో వృద్ధులు పాల్గొన్నా రు.
ఈ సందర్భంగా అస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ (ఇండియా-II) సీఈఓ డాక్టర్ ప వన్ కుమార్ మాట్లాడుతూ, ప్రణామ్ ద్వా రా మా ఇండియా-II నెట్‌వర్క్‌లోని ప్రతి అ స్టర్, కేర్ హాస్పిటల్స్‌ని వృద్ధులకు మరింత అనుకూలంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు వేస్తున్నాం.. ప్రతి వృద్ధుడు తన ఆరోగ్య ప్ర యాణంలో గౌరవం, భరోసా, సంపూర్ణ సం రక్షణను అనుభూతి చెందేలా ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమన్నారు. కలెక్టర్ ప్రియాంక అల మాట్లాడుతూ తెలంగా ణ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది.. అదే సమయంలో ఆరోగ్య సంస్థలు కూడా సమా న బాధ్యతను తీసుకోవాలన్నారు.
ప్రణామ్ వంటి కార్యక్రమాలు వృద్ధుల గౌరవం, నిర ంతర ఆరోగ్య సంరక్షణ, మానసిక భరోసా, ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై దృష్టి సారించడం ద్వారా ప్రభుత్వ ప్రయత్నాలకు తోడ్పడతాయన్నారు. లయ న్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నరసింహరాజు దిచ్‌పల్లి మాట్లాడుతూ ప్రణామ్ అందరితో అనుబంధంగా, భరోసాతో జీవించే వాతావరణాన్ని సృష్టించడం అభినందనీయ మన్నా రు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆసుపత్రు లను అభినందించారు.






