27-10-2025 07:35:55 PM
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలుపించేందుకు సోమవారం కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్, తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్ పేట్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతున్న ప్రజా పాలన విధానాన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అనునిత్యం తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై అసత్యాలను అంటగట్టి గెలవాలని చూడటం వారి భ్రమ మాత్రమేనని అన్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ తో సహాయం కోరిన వారే ఈరోజు అసత్యాన్ని ప్రచురించడం చాలా బాధాకరమన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ గెలుపై నియోజకవర్గం ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి, నర్సింహా రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.