22 June, 2026 | 1:28 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్

05-03-2026 12:15 AM

నూతనకల్, మార్చి 4: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మండలం లోని పలు గ్రామాలలో బుధవారం పర్యటించారు. ఇటీవల మృతి చెందిన పలువురు పార్టీ నాయకుల కుటుంబాలను ఆయన పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మండల పరిధిలోని రామలింగాపురం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మోరగుండ్ల చంద్రయ్య, అలాగే మండల కేంద్రానికి చెందిన దేవిరెడ్డి మారయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న గాదరి కిషోర్ కుమార్ వారి నివాసాలకు వెళ్లి, మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అనంతరం మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్వీ  గ్రామ శాఖ అధ్యక్షుడు కొత్వాల నరేష్ ఇటీవల ప్రమాదవశాత్తు కాలుకు గాయమై ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నరేష్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య, ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిలు గౌడ్, మహేశ్వరం మల్లికార్జున్, గార్డుల లింగరాజు యాదవ్, గుగులోతు కోటేష్  తదితరులు పాల్గొన్నారు.