5 August, 2026 | 1:10 PM

కాపర్ వైర్లు దొంగలించే ముఠా అరెస్ట్

03-09-2025 12:00 AM

రూ.2.50 లక్షలు స్వాధీనం 

కోదాడ సెప్టెంబర్ 2 : మునగాల మండల పరిధిలో మార్చి ఏప్రిల్ మే నెలలలో నాగార్జునసాగర్ కాలువ ఎత్తిపోతల పథకాలకు అమర్చిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ దొంగతనం చేసిన నలుగురిని మునగాల పోలీసులు మంగళవారం చాకచక్యంగా అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.. ఈ మేరకు  డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పి శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు.. బరాకత గూడెం కాలువపై పలువురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగాడు తుండగా మునగాల పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వాస్తవాలు వెల్ల డయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు పట్టడానికి చెందిన పాలకుర్తి వెంకటరామయ్య. గుంటకల్ రాజేశ్వరరావు. బోయపాటి అశోక్. దేవరకొండ ఇషాన్  లను పోలీసులు అరెస్టు చేయగా మరో వ్యక్తి బలి శ్రీకాంత్ పరారీలో ఉన్నట్టు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.. వీరి నుండి రెండు లక్షల 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు..

నిందితుడు వెంకటరామయ్య గతంలో కూడా కాపర్ దొంగతనాలు చేశాడని ఈ వైర్ ను ఒంగోలు నెల్లూరు తిరుపతి ప్రాంతాలలో గుర్తుతెలియని వ్యక్తులకు కిలో 400 చొప్పున అమ్మినట్టు డిఎస్పి పేర్కొన్నారు. మునగాల సిఐ డి రామకృష్ణారెడ్డి. సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ .ఎస్త్స్ర బి ప్రవీణ్ కుమార్ ఐడి పార్టీ స్టాఫ్ రామారావు కొండలు, సూర్యాపేట సిసిఎస్ ఎస్‌ఐ హరికృష్ణ యాదవేంద్ర రెడ్డి సిబ్బంది మల్లేష్ శివ ఆనంద్ స్త్రీలను డిఎస్పి శ్రీధర్ రెడ్డి అభినందించారు.