calender_icon.png 2 July, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరుట్ల పబ్లిక్ స్కూల్‌ను సందర్శించిన మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

02-07-2025 01:07:32 AM

ఇబ్రహీంపట్నం, జూలై 01:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోని ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ పాఠశాలలుగా తీర్చిదిదడంలో భాగంగా మంచాల మండలంలోని ఆరుట్ల పాఠశాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర పౌర స్పందన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ను సందర్శించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్ గౌడ్, ఉపాధ్యాయ బృందంతో కలిసి తరగతి గదులను, ల్యాబ్ లను, క్రీడా మైదానలను, వంటశాలను, ఆదర్శ పాఠశాల హాస్టల్ వసతులను, పరిసరాలను తిరిగి అక్కడి పరిస్థితులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సుప్రియ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ గౌడ్, పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగ, నాగమణి, ధనమూర్తి, కిషన్ చౌహన్, డాక్టర్ జగన్నాథ్, కంబాలపల్లి శ్రీకాంత్, టిఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు ఎండి. అజ్మాత్ ఖాన్, మోతిలాల్, జహిర్ అజాద్, యాదయ్య, పాపిరెడ్డి, లాలగారి జంగయ్య, జానీ పాషా, భూపాల్, నూకం రాజు తదితరులుపాల్గొన్నారు.