02-07-2025 01:06:59 AM
సిద్ధిపేట కలెక్టరేట్, జూలై 1 : విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు రేకెత్తించే పరిశోధనల వైపు మళ్లించేందుకు ఇన్స్పైర్ మనక్ పోటీలు ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఇన్స్పైర్ మనక్ పోటీల వాల్ పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఐదు ప్రాజెక్టులు రూపొందించాలన్నారు.
6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలకు ఎన్నికయ్యేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాసరెడ్డి, కోఆర్డినేటర్ భాస్కర్, జిల్లా సైన్స్ అధికారి కల్లేపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.