calender_icon.png 12 May, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి

11-05-2025 07:21:22 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కార్వాయి మండలం కన్కల్ గ్రామంలో ఆదివారం ఆయన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ... ఆనాడు సమ సమాజ స్థాపన కోసం శివాజీ విశేష కృషి చేశాడని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించడంలో ఆయన తీవ్రమైన కృషిని కొనసాగించాడన్నారు. ప్రతి యువకుడు శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ రామ్ రెడ్డి, బాలాజీ రావు, మనోహర్రావు, హరిస్మరణ రెడ్డి, జైపాల్ రెడ్డి, శివాజీ రావు, రాజేశ్వరరావు, ముకుందరావు, ఆనందరావు, సాయిరెడ్డి కృష్ణారెడ్డి, రామచందర్రావు తదితరులు పాల్గొన్నారు.