11-05-2025 07:25:01 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో శనివారం రాత్రి ప్రత్యేక భజన సంకీర్తనలు నిర్వహించారు ప్రతి రెండవ శనివారం ఆశ్రమంలో శ్రీ శబరిమాత భక్తులు ప్రత్యేక కీర్తనలు ఆలపిస్తారు. కామారెడ్డి, నిర్మల్, నారాయణఖే, ఆదిలాబాద్, మెదక్ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ శబరిమత భక్తులు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.