20 August, 2026 | 1:46 AM

సుస్మితపై కాంగ్రెస్ సీరియస్

20-08-2026 12:44 AM
  1. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖకు ఆదేశం 
  2. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి
  3. చిన్నారెడ్డికీ నోటీసులు

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాం తి): మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మి త.. సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకున్నది. సుస్మిత వ్యాఖ్యలపై ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖ నుంచి వివరణ తీసుకోవాలని పీసీసీ నిర్ణయించింది. మరో వైపు కొండా సుస్మితపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై కఠిన చర్య లు తీసుకునేందుకు క్రమశిక్షణ కమిటీ సిద్ధ మవుతోంది.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా సుస్మిత వ్యాఖ్యలు ఉన్నయాని పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వా లని మంత్రి కొండా సురేఖకు ఆదేశాలు జా రీ చేశారు. అలాగే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిని కూడా మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ కోరింది. 

అదిలాబాద్ నేతలకు నోటీసులు

అదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కార్పోరేషన్ మెంబర్ సంజయ్‌లకు  టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ బలోపేతం, సర్‌పై జరిగినా సమీక్షా సమావేశంలో జరిగిన గొడవపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరి ంది. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుటనే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు గొడవకు దిగి, ఆన్ పార్లమెంటరీ పదాలను వాడటాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించినట్లు పేర్కొన్నారు.

మరో వైపు, ఎల్బీనగర్ కాంగ్రెస్ సీనియర్ నా యకులు జక్కిడి ప్రభాకర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ  మేరకు టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలనే పలువురిని వ్యక్తిగత విషయాలపై దూషించడమే కాకుండా కులాల పేరుతో దూషించిన సంఘటనలపై సరైన ఆధారాలు ఉండటంతో ప్రభాకర్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ క్రమశిక్షణ కమిటీ బుధవారం ప్రకటనలో  తెలిపింది.