calender_icon.png 16 October, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువులకు టీకా వేయించండి

16-10-2025 12:00:00 AM

వెటర్నరీ డాక్టర్ కె. నరేందర్.

గండీడ్, అక్టోబర్ 15: పశువులకు గాలి కుంటి వ్యాధి నివారణ టీకాను కచ్చితంగా వేయించవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల వెటర్నరీ డాక్టర్ నరేందర్ అన్నారు. బుధవారం విజయ క్రాంతి దినపత్రికతో మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని పశువులకు గాలి కుంటి వ్యాధి నివారణ టీకాలను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. 

మండలం లోని వి. ఏ, జే.వీ.ఓ, సి.ఓ.ఎస్, జి.ఎం, ఓ.ఎస్, లు గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆరు నెలలకు ఒక సారి వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉచిత గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో అన్ని గ్రామాలలో పశు వైద్య బృందాలు ప్రతి గ్రామాన్ని సందర్శించి మూడు నెలల వయస్సు దాటిన గేదె జాతి,గో జాతి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.

రైతులు పశువులకు టీకాలు వేయించి, గుర్తింపు కొరకు చెవి పోగు వేయించి, వివరాలు ‘భారత్ పశు భూషణ్‘ యాప్ లో నమోదు చేసుకొని మన రాష్ట్రాన్ని గాలి కుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా కొనసాగించడానికి సహకరించాల్సిందిగా కోరారు.