12 June, 2026 | 8:10 PM

అమ్మవారి ఆలయ నిర్మాణానికి 5 లక్షలు

12-06-2026 07:09 PM

* దాతల సహకారంతోనే ఆలయ నిర్మాణం 

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో  నూతనంగా నిర్మిస్తున్న కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి మాజీ సర్పంచి కీత జ్యోతి రామారావు ఐదు లక్షల రూపాయల విరాళాన్ని శుక్రవారం అందజేశారు. గ్రామంలో నూతనంగా కనకదుర్గ దేవాలయాన్ని గ్రామస్తుల సహకారంతో ఆలయ నిర్మాణం తలపెట్టారు. ఆలయ నిర్మాణం కోసం లక్ష రూపాయలు, అమ్మవారి విగ్రహానికి బంగారు ఆభరణాలు కోసం నాలుగు లక్షల రూపాయలు విరాళంగా అందజేస్తున్నట్లు వారు తెలిపారు. కీత కోటయ్య కనకమ్మ దంపతుల కుమారులు, కీత రామారావు, జ్యోతి, కీత నాగేశ్వరరావు సునీత, వారి కుమారుడు గౌతమ్ ఆదిత్య, ఈశ్వరచంద్ర,విధాత్రి విక్రమ్ ఆధ్వర్యంలో ఈ విరాళాన్ని అందించినట్లు శివాలయం ఆలయ కమిటీ చైర్మన్ రాయప్రోలు శ్రీరామయ్య శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా నిర్మిస్తున్న కనకదుర్గ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.