24 May, 2026 | 2:29 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

మాజీ సర్పంచ్ మిస్సింగ్

30-11-2025 12:04 AM
  1. శుక్రవారం సాయంత్రం నుంచి కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు 

ప్రస్తుతం ఎన్నికల్లోనూ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్‌ఎస్ మహిళా నేతగా వల్లాల మంగమ్మ

భద్రాద్రి జిల్లా సుభాష్‌నగర్‌లో ఘటన

ఇల్లెందు, నవంబర్ 29 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం సుభాష్ నగర్ మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి, బీఆర్‌ఎస్ మహిళా నేత వల్లాల మంగమ్మ శుక్రవారం రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, తమ బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో చూసినా ఆచూకీ లభించలేదని కుటుం సభ్యులు పేర్కొన్నారు. దీంతో శనివారం ఉదయం ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తమ మధ్య ఎటువంటి కలహాలు లేవని, ఎవరితోనూ శత్రుత్వం లేదంటూ మంగమ్మ భర్త వల్లాల నరసయ్య తెలిపారు.

తిరిగి సర్పంచ్ అభ్యర్థిగా సైతం పోటీ చేయనున్న వల్లాల మంగమ్మ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ మూడో తేదీ నామినేషన్ వేసే క్రమంలో అనుమానాస్పదంగా కనిపించకపోవడం సర్వత్ర ఆశ్చర్య అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్.. మంగమ్మ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో వల్లాల మంగమ్మ గెలుపు ఖాయమని, ఈ నేపథ్యంలో రాజకీయంగా ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా అనే విషయంపై ఇల్లెందు మండలంలో సర్వత్ర చర్చనీయాంశమైంది.