24 May, 2026 | 3:35 PM

Breaking News

అడ్డేసార సర్పంచ్ పంద్రం శేకును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు   •   లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు మంజూరు   •   పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం   •   వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం   •   పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక   •   రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో   •   140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •  

అప్పుడొక్క రోజు.. ఇప్పుడు పదిరోజుల దీక్షాదివస్!

30-11-2025 12:03 AM
  1. బీఆర్‌ఎస్ పదేళ్లు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి
  2. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ చేసేవాళ్లని.. ఇప్పుడు పది రోజుల పాటు దీక్షా దివస్ నిర్వహిస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. దీక్షా దివస్ పేరిట బీఆర్‌ఎస్ పార్టీ నాటకాలు ఆడుతోందని, అయినా తెలంగాణ ప్రజలు వాటిని నమ్మరని అన్నారు. శనవారం హైదరాబాద్ మీడియాతో మంత్రి సీతక్క మాట్లా డారు.

ప్రజలకు పదేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో ఈ దీక్షా దివస్‌లో బీఆర్‌ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేసిందన్నారు. ఈ విజయాలను ప్రజలకు వివరిం చేందుకు తాము 10 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని..

వీటిని అడ్డుకునే కుట్రతోనే దీక్షా దివస్ పేరుతో బీఆర్‌ఎస్ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. ‘తెలంగాణ వచ్చాక వందల రెట్లు లబ్ది పొం దింది కేసీఆర్ కుటుంబమే’ అని స్పష్టం చేశా రు. ఆ పార్టీ దగ్గర అధికారం మాత్రమే లేదని, కోట్లాది రూపాయలు ఉన్నాయని తెలిపారు. అధికారం ఉంటేనే ప్రజల్లో ఉం టామని, లేకపోతే బయటకే రావొద్దని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.