8 March, 2026 | 2:57 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •   గోపాలరావుపల్లెలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు   •  

ఎన్నికలు బహిష్కరిస్తున్నాం

30-11-2025 12:06 AM
  1. సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి జిల్లా మల్లుపేటవాసుల నిర్ణయం

సర్దిచెప్పిన అధికారులు 

కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): తమ గ్రామ సమస్యలు ఎవరు పట్టించుకోవడంలేదని, పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామంలో అనేక సమస్యలు ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవ డంలేదని గ్రామస్థులు వాపోయారు. సమస్యలు పరిష్కరించేదాకా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోమంటూ తేల్చి చెప్పడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు.

మూడు రోజులైనా సర్పంచుకు, వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో చివరి రోజున శనివారం మండల అధికారులు గ్రామానికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ గ్రామం కల్వరాల రెవిన్యూ గ్రామంలో ఉందని సపరేట్ చేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. తమ గ్రామం మీద 44 జాతీయ రహదారి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రాణనష్టం జరుగుతుందని విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.

గ్రామ స్టేజి వద్ద బ్రిటి నిర్మాణం చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, అందుకే ఎన్నికలు బహిష్కరిస్తున్నామంటూ తెలిపారు. అధికారులు మూడు గంటల పాటు గ్రామస్తులతో చర్చించారు. కలెక్టర్‌తో మా ట్లా డి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో చివరి సమయంలో నామినేషన్లు దాఖలు చేశారు. చివరి సమయంలో శనివారం సాయంత్రం  సర్పంచ్ స్థానానికి ఇద్దరు నామినేషన్లు వేయగా, వార్డు సభ్యులు స్థానాలకు నామినేషన్లు వేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.