2 May, 2026 | 1:45 AM

రాష్ట్ర నూతన డీజీపీని కలిసిన నాగిరెడ్డిపేట గ్రామ మాజీ సర్పంచ్

02-05-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, మే 1 (విజయక్రాంతి): రాష్ట్ర డిజిపిగా సివి.ఆనంద్ నూతన బాధ్యతలు సందర్భంగా నాగిరెడ్డిపేట మండలం మాజీ సర్పంచ్, భారత్ గ్యాస్ ప్రొప్రైటర్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సివి.ఆనంద్ తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని అభినందనలు తెలియజేశారు.