2 May, 2026 | 1:36 AM

పట్టణాభివృద్ధే మా లక్ష్యం

02-05-2026 12:00 AM

మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

కామారెడ్డి, మే 1 (విజయక్రాంతి): పట్టణాభివృద్ధే మా లక్ష్యమని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణంలోని రెండు స్మశాన వాటికల అభివృద్ధికి ఎవరు అడ్డుకోవడం లేదని తెలిపారు.

స్మశాన వాటికల అభివృద్ధి కోసం డిపిఆర్ తయారు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టు బి డి కో నిధుల ద్వారా రెండు స్మశాన వాటిక అభివృద్ధికి కోటి 30 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.

స్మశాన వాటిక అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిన విషయంలో పూర్తి సమాచారం తమకు లేదని ఒకవేళ ఏ స్వచ్ఛంద సంస్థ పట్టణంలో అభివృద్ధి పనుల విషయంలో ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. హౌసింగ్ బోర్డ్, ఇంద్రనగర్ కాలనీలో స్మశాన వాటికల సందర్శనకు అన్ని పార్టీల కౌన్సిలర్లతో కలిసి వెళ్లినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు అంజద్, జావేద్, నాయకులు భాస్కర్ గౌడ్, కళ్లెం సత్యం, సిద్ధిక్, కాళ్ల గణేష్, చిట్టి బాబు, మాజీ, లడ్డు పాల్గొన్నారు.