calender_icon.png 13 December, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనగణనకు 11,718 కోట్లు

13-12-2025 12:36:56 AM

  1. ఉపాధి హామీ పథకం పేరు మార్పు 
  2. ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా నామకరణం 
  3. పనిదినాలు 100 నుంచి 125 రోజులకు.. 
  4. కూలీల వేతనం 220 నుంచి 240కి పెంపు 
  5. పీఎం కిసాన్ నిధి ఎకరాకు 6 వేల నుంచి 10 వేలకు 
  6. తెలంగాణకు 4 కేంద్రీయ విద్యాలయాలు 
  7. బీమా రంగంలోకి 100% ఎఫ్‌డీఐ 
  8. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: కేంద్ర క్యాబినెట్ 2027లో రెండు విడతల్లో జనగణన చేపట్టాలని నిర్ణయిం చింది. ప్రక్రియ చేపట్టేందు కు రూ.11,718 కోట్ల బడ్జెట్‌కూ ఆమోదం తెలిపింది. అత్యాధునిక డిజిటల్ సాంకేతికతను విని యోగించి జనగణన చేపడతామని స్పష్టం చేసింది. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గృహాలను జాబితా చేసి లెక్కిస్తామని, 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని తెలిపింది. దేశవాప్తం గా 30 లక్షల మంది సిబ్బంది ప్రక్రియలో భాగస్వాములవుతారని పేర్కొంది.

ఉపాధి హామీ పథకం పేరు ను ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా నామకరణం చేసింది. గ్రా మీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచింది. ఒక రోజుకు కూలీలకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.220 నుంచి రూ.240కి పెంచింది. రైతులకు మరింత ఆర్థిక భరోసా కల్పించేందుకు పీఎం కిసాన్ నిధి ఎకరా రూ.6 వేల నుంచి రూ.10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.

పథకానికి రూ.6,520 కోట్లు కేటాయించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 1.5 కోట్ల గృహాలు నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశమై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించి క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా మారుస్తూ నిర్ణయం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అలాగే పథకం కింద ఒక కుటుంబానికి ఏడాదికి ఉన్న గరిష్ఠ పనిదినాలను 100 నుంచి 120 రోజులకు పెంచింది. రోజు కూలీని రూ.240గా నిర్ణయించింది. పథకం అమలు కోసం రూ.1.51 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడించారు.

బీమా రంగంలోకి 100 శాతం ఎఫ్‌డీఐ

బీమారంగంలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సాధారణ, జీవిత, ఆరోగ్య బీమాలో 74 శాతం వరకు ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. ఈ రంగంలోకి ఎఫ్‌డీఐలకు పూర్తిగా అనుమతినిస్తే, దేశీయ పెట్టుబడులూ పెరిగే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతిస్తే, విదేశీ సంస్థలు భారతీయ కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగా పనిచేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని, దీనివల్ల ఈ రంగానికి మేలు జరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నది. 

ఇతర నిర్ణయాలు..

బొగ్గు గనుల పరిధిలో అనేక సంస్కరణలు తీసుకువచ్చే అంశానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వీటిలో తెలంగాణకు నాలుగు, ఆంధ్రప్రదేశ్‌కు చొప్పున కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది. అలాగే నాలుగు కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రూ. 2వేల కోట్లు కేటాయించింది.

చిన్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలుగా తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద కొత్త ప్రయోగ వేదిక నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘మేక్ ఇన్ ఇండియా’ను బలోపేతం చేసేందుకు రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచింది. దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు నేషనల్ టెలి-మెడిసిన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నీటిపారుదల పథకాలకు జాతీయ మిషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

50 ప్రధాన, మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేసేందుకు రూ. 35,000 కోట్లు కేటాయించి కొత్త జాతీయ మిషన్‌కు ఆమోదం తెలిపింది. భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద ఇంటర్నెట్ సేవలకు ఆమోదం తెలిపింది. అందుకు అదనంగా రూ. 8,000 కోట్ల నిధులు సైతం కేటాయించింది. రాష్ట్రాల ఆర్థిక బలోపేతం కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. తద్వారా రాష్ట్రప్రభుత్వాలు తమ మూలధనం పెంచుకునేందుకు వడ్డీలేని రుణాల రూపంలో రూ. 1.3 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

క్వాంటం టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అదనంగా రూ. 4 వేల కోట్ల నిధులు కేటాయించింది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెజైస్‌కు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు ఇచ్చేందుకు వీలుగా రూ. 15,000 కోట్లతో కొత్త క్రెడిట్ గ్యారెంటీ పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సైబర్ నేరాలను నిరోధించేందుకు సైబర్ సెక్యూరిటీ పాలసీకి ఆమోదం తెలిపింది.

సెమీ కండక్టర్ తయారీ వ్యవస్థను ప్రోత్సహించేందుకు రూ. 12,000 కోట్లు కేటాయించింది. కొత్త సెమీకండక్టర్ తయారీ కర్మాగారాలను నెలకొల్పే సంస్థలకు ఆర్థిక సాయం పెంచింది. 2026 సీజన్‌లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరికి ఒక క్వింటాకు రూ.445, బాల్  కొబ్బరి ఒక క్వింటాకు రూ.400 చొప్పున మద్దతు ధర పెంచింది. దీంతో మిల్లింగ్ కొబ్బరి క్వింటా రూ.12,027, బాల్ కొబ్బరి క్వింటాకు రూ.12,500కు చేరింది.