24 March, 2026 | 8:41 PM

Breaking News

విద్యుత్ షాక్ తో మరణించన వ్యక్తికి భీమా చెక్కు అందజేత   •   ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •  

అభివృద్ధిపై మాట్లాడే అర్హత పుట్ట మధుకు లేదు

08-01-2026 12:20 AM

ముత్తారంలో విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం

ముత్తారం, జనవరి 7(విజయక్రాంతి): ముత్తారం మండల అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత పుట్ట మధుకు లేదని  బుధవారం ముత్తారం కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు  చొప్పరి సదానందం అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ  బాలాజీ తో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మండలం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కమాన్ పూర్ మాజీ జడ్పిటిసి పుట్ట మధు ముత్తారంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాట్లాడడం సరికాదన్నారు. 

మంత్రి చోరువతో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతు న్నారి,  మీకు అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామం నుండి మీ మండల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్న సొంత గ్రామం ఓడేడు వరకు రూ. 30 కోట్లతో రోడ్డు నిర్మించామని,  ఇంకా అభివృద్ధి పనులు నడుస్తున్నా యని, మీ  ప్రభుత్వలో గంగాపురి నుండి ఓడేడు వరకు ఉన్న రహదారి ఇసుక లారీలతో గుంతలమయం చేసి నాశనం చేస్తే అ రహదారిని మంత్రి  రూ. 60 కోట్లతో  రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నామని, మచ్చుపేట గ్రామం నుండి బగుళ్ల దేవస్థానం వరకు రెండు కోట్లతో సిమెంటు రోడ్డు నిర్మించామని, దర్యాపూర్ ఆదర్శ పాఠశాలలో కోటి రూపాయలకు పైగా వెచ్చించి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేస్తున్నమని, మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో రూ. 60 లక్షలకు పైగా డబ్బు లు వెచ్చించి అభివృద్ధి పనులను చేస్తున్నమని, పోతారం, దర్యాపూర్, శాత్రాజ్ పల్లి గ్రామాలలో నూతనంగా మంజూరు చేసిన సబ్ స్టేషన్లు మీకు కనబడడం లేదా అని,  రూ. 12 కోట్ల కు పైగా మండలంలోని అన్ని గ్రామాల్లో జరిగిన సిసి రోడ్లు, పాఠశాలల ఆధునీకరణకు వెచ్చించిన డబ్బులు కనబడడం లేదా అని ప్రశ్నించారు. 

ఈ రెండేళలో ముత్తారం మండలానికి మా మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో అభివృద్ధి కొరకు మేమెన్ని  కోట్లు వెచ్చించామో బహిరంగ చర్చ కైనా సరే సిద్ధమని సవాల్ విసిరారు. సూరయ్యపల్లి నుండి ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీలోని  శుక్రవారంపల్లి వరకు రూ. 29 కోట్ల 15 లక్షలతో డబుల్ రోడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసిన శ్రీధర్ బాబుకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలుపారు. ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి అభివృద్ధి పనులను చూడాలని పుట్టమదుకు హితవు పలికారు. కార్యక్రమంలో కమాన్ పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజయ్య, డైరెక్టర్ బొల్నేని బుచ్చం రావు, ముత్తారం మాజీ పీఏసీఎస్ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు వాజీద్ పాష, ముత్తారం మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గాధo శ్రీనివాస్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడవేన సంపత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్‌ పాల్గొన్నారు.