calender_icon.png 9 January, 2026 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9న జాబ్ మేళా

08-01-2026 12:19:28 AM

రఘనాథపాలెం /ఖమ్మం, జనవరి -7(విజయక్రాంతి): జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగం అపోలో ఫార్మసీ, హైదరాబాద్ లో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 9న శుక్రవారం ఉదయం 10 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటిఐ., టేకులపల్లి) ఖమ్మం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ లో పని చేసే విధంగా అపోలో ఫార్మసీలో ఫార్మాసిస్ట్ గా పని చేయుటకు 19-30 సంవత్సరాల వయస్సు గల డి ఫార్మసీ / బి ఫార్మసీ / ఎం ఫార్మసీ (పి.సి.ఐ.) అర్హత గల యువతీ, యువకులు అర్హులని, ఫార్మసిస్ట్ అసిస్టెంట్, అప్రెంటిస్షిప్ పోస్టులకు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉండి మెడికల్ స్టార్ లో పనిచేసిన అను భవం ఉన్న గల 19-30 సంవత్సరాల వయస్సు గల యువకులు అర్హులని, ఎంపికైన వారికి వేత నం 12 వేల నుండి 25 వేల వరకు ఉంటుందని అన్నారు.

మొత్తం దాదాపు 100 ఉద్యోగ ఖాళీల భర్తీకి గాను జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు, తమ విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో నిరుద్యోగ యువతీ, యువకులు జాబ్ మేళాకు హాజరు కావాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రక టనలో పేర్కొన్నారు. జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.